Published On: Sat, Sep 12th, 2020

ఏపీకి రెవెన్యూ లోటు నిధులు విడుదల

దిల్లీ, సెల్ఐటి న్యూస్: కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను శుక్రవారం విడుదల చేసింది. దీంతో ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీకి కొంత ఊరట
లభించినట్టైంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ప్రభుత్వం శుక్ర‌వారం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు సంబంధించి రూ. 6,195.08 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.491.41 కోట్లను రిలీజ్ చేసింది. 2020 నుంచి 2025 మధ్య కాలానికి గాను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను ఆర్థిక సంఘం తెలుస్తుంది.

Just In...