* రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి
సెల్ఐటి న్యూస్,విజయవాడ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)ను రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేస్తామని అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన విలేకర్ల సమావేశంలో బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్పీఐ పార్టీ తరుపున పూర్తి స్థాయిలో అధ్యక్షత బాధ్యతలు ఇచ్చిన కేంద్ర మంత్రి, ఆర్పీఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అత్వాలే గారికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఆర్పీఐ పార్టీ అన్ని అసెంబ్లీ. పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని, నేటి నుంచి పార్టీ ని ఆంద్రప్రదేశ్‌లో పటిష్టపరిచే విధంగా ప్రణాళికతో ముందుకు నడుస్తామన్నారు.పార్టీ రాష్ట్ర సహాయ అధ్యక్షుడుగా గుంటూరుకు చెందిన డాక్టర్. చేబ్రోలు ప్రసాద్‌రావు. గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా మేకా వెంకటేశ్వర రావు.వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడుగా ఈప్పార్తి.ప్రసాద్ రావు.రాష్ట్ర కార్యదర్శిగా.మంగలగిరికి చెందిన మట్టుకొయ్య సుధాకర్ రావు ను నియమించినట్లు కొమ్మారెడ్డి బ్రహ్మనందరెడ్డి గారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కమిటీలు.రాష్ట్ర కమిటీని త్వరలో విస్తరింపచేస్తామన్నారు. కన్వీనర్ పేరం శివనాగేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయడంలో విపలమైందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంపై పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఉద్యమాలు చేస్తామన్నారు.రాష్ట్ర కార్యదర్శి మట్టుకొయ్య సుధాకర్ రావు.వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఇప్పర్తి ప్రసాదరావు .గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేకా వెంకటేశ్వర రావు రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డితో పాటు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →