Published On: Mon, May 13th, 2019

ఏపీలో “ఇటిపిబిఎస్” ద్వారా 60,250 మందికి బ్యాలెట్ పేపర్లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: దేశంలో పదివేల సర్వీసు ఓటర్లు (ఇటిపిబిఎస్) నమోదైన రిటర్నింగు అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం “ఇటిపిబిఎస్” ఓట్ల లెక్కింపు విధానంపై సోమవారం న్యూఢిల్లి నుండి  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన‌ట్లు డిప్యూటీ సీఈఓ టి. చిరంజీవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 60,250 మందికి “ఇటిపిబిఎస్” ద్వారా బ్యాలెట్ పేపర్లను పంపడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు పరిధిలో 13,690 బ్యాలెట్ పేపర్లు పంపగా ఇప్పటి వరకు 6,138 బ్యాలెట్ పేపర్లు తిరిగి వచ్చాయని శ్రీకాకుళం పిసి రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. సుమారు 10 వేలకు పైబడి బ్యాలెట్ పేపర్లు వస్తాయని ఆశిస్తున్నట్లు నివాస్ తెలిపారు. అందుకు అనుగుణంగా సదరు “ఇటిపిబిఎస్” ఓట్ల లెక్కింపున‌కు చర్యలు తీసుకోవడం జరుగుతొందని ఆయన తెలిపారు. ఇసిఐ సాంకేతిక సహాయకుడు సాక్షం కుమార్ ఇటిపిబిఎస్ ద్వారా జారీ చేసిన బ్యాలెట్ పేపర్ల లెక్కించుటలో ఉన్న వివిధ దశలను గురించి వివరించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో చేయబడిన ఏర్పాట్లను సమీక్షించి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి డిప్యూటీ సిఈఓ టి. చిరంజీవి, ఐటి ప్రాజెక్టు మేనేజర్ మల్లిఖార్జున్ ఈ సమావేశానికి హజరై వివిధ సాంకేతిక సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Just In...