Published On: Wed, Jul 10th, 2019

ఏపీలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సబ్‌కమిటీ

* స‌బ్‌క‌మిటీలో ఆరుగురు మంత్రులు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని (కేబినెట్‌ సబ్‌ కమిటీ) నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు మంత్రులతో ప్రభుత్వం ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, ఆదిమూలపు సురేష్‌ ఉన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Just In...