Published On: Wed, Jul 22nd, 2020

ఏపీలో కరోనా క‌ల్లోలం..

* ఒక్కరోజే 65 మరణాలు

* రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఏపీలో కరోనా వైరస్‌ మహా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్‌ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా జిల్లాలో 10, పశ్చిమగోదావరిలో 8, తూర్పుగోదావరిలో 7, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 5 చొప్పున, విజయనగరం జిల్లాలో 4, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే.. తాజాగా బుధ‌వారం కొత్తగా 6494 మంది కోలుకొని డిశ్చార్జ‌య్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 64,713కి పెరిగింది.వీరిలో 823మంది ప్రాణాలు కోల్పోగా.. 32,127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 31,763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

Just In...