Published On: Fri, Sep 4th, 2020

ఏపీలో కరోనా విలయతాండ‌వం…

* కొత్తగా 10,199 పాజిటీవ్ కేసులు న‌మోదు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తూనే ఉంది. ఇటీవ‌ల కొద్ది రోజులుగా ప్ర‌తిరోజూ 10వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌ల్గిస్తుంది. తాజాగా గడ‌చిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తాజా కేసుల‌తో కలిపి ఏపీలో 4 లక్షల 65 వేల 730కి కరోనా కేసులు చేరాయి. గ‌డ‌చిన 24 గంట‌ల్లో కరోనాతో 75 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఏపీలో 4200కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం ఏపీలో లక్షా 3 వేల 701 యాక్టివ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఏపీలో 3 లక్షల 57 వేల 829 మంది కోలుకొని ఇళ్ల‌కు చేరారు. ఏపీలో ఇప్పటి వరకు 39 లక్షల 5 వేల 775 కరోనా టెస్ట్‌లు చేశారు. తాజాగా .. తూర్పుగోదావరి జిల్లాలో 10, చిత్తూరు 9, గుంటూరు 9, అనంతపురం 7, కృష్ణా 7, పశ్చిమగోదావరి జిల్లాలో 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు జిల్లాలో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. జాతీయ స్థాయిలో పాజిటివ్‌ కేసులతో పాటు పాజిటివిటీ రేటులోనూ ఏపీ రెండో స్థానంలోకి వెళ్లింది.

Just In...