Published On: Thu, Jul 30th, 2020

ఏపీలో కరోనా విల‌య‌తాండ‌వం…

* 68 మంది మృతి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడ‌చిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 10,167 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. మొత్తం 70,068 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివార‌ణ కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 69,252గా ఉంది. ఇప్పటివరకు 60,024 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1281 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడ‌చిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 271 పాజిటీవ్ కేసులు న‌మోదుకాగా… ముగ్గురు మరణించారు.

 

Just In...