Published On: Tue, Aug 31st, 2021

ఏపీలో కొత్తగా 1,115 పాజిటీవ్ కేసులు న‌మోదు

* 19 మంది మృతి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. తాజాగా ఆరుగురు కరోనా మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. మరోవైపు 1,265 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 14,693 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,66,29,314 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లా్ల్లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Just In...