Published On: Thu, Nov 19th, 2020

ఏపీలో కొత్తగా 1,316 కరోనా పాజిటీవ్ కేసులు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: గడ‌చిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 75,165 నమూనాలను పరీక్షించగా 1,316 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,910కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,821 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,08,868 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం గురువారం విడుద‌ల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Just In...