Published On: Sat, Oct 10th, 2020

ఏపీలో కొత్తగా 5,653 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో కొత్తగా 5,653 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,50,517కి చేరింది. మొత్తం 73,625 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,624గా ఉంది. ఇప్పటివరకు 6,97,699 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,194 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శ‌నివారం విడుద‌ల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

Just In...