Published On: Thu, Sep 17th, 2020

ఏపీలో కొత్త‌గా 8,835 క‌రోనా కేసులు

* 24 గంటల్లో 10,845 డిశ్చార్జ్

* 64 మంది మృతి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో గడ‌చిన 24 గంటల్లో 10,845 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.
బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి. గడ‌చిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,92,760కు చేరింది. కొత్తగా 64మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Just In...