Published On: Tue, Aug 11th, 2020

ఏపీలో క‌రోనా ఉధృతి…

* ఒక్క‌రోజే 9024 కేసులు నమోదు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో 9024 కేసులు నమోద‌య్యాయి. అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూలు  జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. 87  కొవిడ్  మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా  అనంతపూర్, చిత్తూరు జిల్లాలో నమోద‌య్యాయి. నాకు వైర‌స్ రాదు అని నిర్లక్ష్యంగా మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఎప్పటికప్పుడు చేతులు కాళ్లు శుభ్రపరుచు చేసుకోకుండా ఉన్నట్లయితే వీధిలోనే ఉన్న కొరోనాను ఒంటిలోనికి. ఇంట్లోనికి తెచ్చుకున్నట్లే. ప్ర‌స్తుతం ఈ కరోనా బయటికి వెళ్లి వచ్చేవాళ్ల నిర్లక్ష్యం వల్ల ఇంటిలోని వారందరికీ కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.. అత్య‌వ‌వ‌సరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు.

 

Just In...