Published On: Mon, Apr 15th, 2019

ఏపీలో తెదేపాదే అధికారం..

* ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ధీమా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఎన్నికల సంస్కరణలకు ఇది కీలక సమయమని, అన్ని రాజకీయ పార్టీలూ ఈ దిశగా ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పిలుపునిచ్చారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స‌రైన కసరత్తు చేయకుండానే ఈసీ ఇటీవల ఎన్నికలు నిర్వహించిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా ఎన్నికల సంస్కరణలు జోరందుకుంటున్న తరుణంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ వేగానికి గండిపడిందని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు. ఈసీ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. ఈవీఎంల మొరాయింపు, శిక్షణ లోపాలు, ఓటర్లు వెనుదిరిగిన ఘటనలకు ఎన్నికల కమిషన్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన ఆధిక్యతతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

Just In...