Published On: Tue, Dec 10th, 2019

ఏపీలో నేటి నుంచి అమలు కానున్న ఆర్టీసీ ఛార్జీల పెంపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు బుధ‌వారం నుంచి అమలు కానున్నాయి. సవరించిన చార్జీలతో  పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ. పల్లెవెలుగుబస్సుల్లో  కి.మీ.కు 10 పైసలు పెంపు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కి.మీ.కు 20 పైసలు పెంపు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు చార్జీ పెంపు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు. సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు అనగా 10 కి.మీ. వరకు ఛార్జీల పెంపుదల లేదు. తదుపరి 75 కి.మీ. వరకు రూ.5 ఛార్జీ పెంపు. డీజిల్‌ ఛార్జీలు నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగాయి. డీజిల్ ధరల పెంపు వల్ల సంస్థకు ఏటా రూ.630 కోట్ల అదనపు భారం. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం. నష్టాన్ని భర్తీ చేసేందుకే ఆర్టీసీ చార్జీలు పెంచామ‌ని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Just In...