Published On: Tue, Apr 16th, 2019

ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై గ‌గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ ఫిర్యాదు

* అప్పుడు చంద్రబాబు గెలిచింది ఇదే ఈవీఎంలతోనే 

* స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతను కేంద్రానికి అప్పగించాలి

* మీడియాతో వైఎస్ జగన్ 

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: వైకాపా అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మంగ‌ళ‌వారం కలిశారు. ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ గవర్నర్‌కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీలతో కూడిన తమ పార్టీ బృందం దిల్లీలో సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసిందని.. మళ్లీ అవే అంశాలను ఇక్కడ గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన దాడి ఘటనలను గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో దొంగ కేసులు పెడుతున్న వైనం గురించి చెప్పినట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై కాకుండా భాదితులపై కేసులు పెడుతున్నారని జగన్‌ ఆరోపించారు. ‘చంద్రబాబు 2014లో గెలిచింది ఇదే ఈవీఎంలతో. అప్పుడు వీవీప్యాట్లు కూడా లేవు అని జ‌గ‌న్ గుర్తు చేశారు. అప్పుడు ఎవరికి ఓటు వేశామో తెలియని పరిస్థితి. అయినా మేం ఈవీఎంలపై ఫిర్యాదు చేయలేద‌న్నారు. ఇప్పుడు వీవీప్యాట్లు వచ్చాయి. ఎవరికి ఓటు వేస్తున్నామో కనిపిస్తుంది. నంద్యాల ఉప ఎన్నికలో ఇదే ఈవీఎంలతో తెదేపా గెలిచింది. చంద్రబాబుకు అనుకూలంగా ఫలితం వస్తే ఓకే.. లేదంటే ఈవీఎంలపై పోరాటం చేస్తారు. ప్రజల మద్దతు తనవైపు లేదు అని తెలుసుకొని ఇప్పుడు ప్రజాతీర్పును అవహేళన చేస్తు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈవీఎంల మీద నెపాన్ని నెట్టుతున్నారు.’ అని జగన్‌ అన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతను కేంద్రానికి అప్పగించాలని జగన్‌ కోరారు.

Just In...