Published On: Mon, Jun 10th, 2019

ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా

* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు  

సెల్ఐటి న్యూస్‌, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో భాజపా బలపడే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. భాజపా శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. తిరుపతిలో ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోవద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఏపీలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నామని..  దాన్ని ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పారు. తాను కూడా ఏపీలో పర్యటించి భాజపా బలోపేతానికి కృషి చేస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు.

Just In...