Published On: Sat, Sep 19th, 2020

ఏపీలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ అత్య‌ధిక సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆరోగ్యశాఖ శ‌నివారం విడుద‌ల చేసిన బులిటెన్‌లో ఏపీలో కొత్తగా 8,218 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 61,7776కు చేరింది.  ఇందులో 81763  కేసులు యాక్టివ్‌గా ఉంటే 530711 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడ‌చిన 24 గంటల్లో ఏపీలో 58 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5302కు చేరింది.

Just In...