Published On: Tue, Oct 22nd, 2019

ఏపీలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: బంగాళాఖాతంలో అల్పపీడనం కార‌ణంగా కోస్తా, ఉత్తరాంధ్ర,  రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మంగ‌ళ‌వారం చిత్తూరు, అనంతపురం,  నెల్లూరు,  ప్రకాశం,  గుంటూరు,  కృష్ణా,  ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు. బుధ‌, గురువారాల్లో కూడా కోస్తా, ఉత్తారాంద్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో వాగులు,  వంకలు,  నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి. ప్రజలు వాగులు,  నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. పలుచోట్ల పిడుగులు,  ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయ‌ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ హెచ్చ‌రించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Just In...