Published On: Thu, Sep 3rd, 2020

ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గింపు

అమరావతి క్రైం, సెల్ఐటి న్యూస్‌: దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం థరల్ని సవరిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు ఇప్ప‌టి నుంచే వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ధరలు సవరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఎస్ఈబీ. శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవనంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయని పేర్కోన్న ఎస్ఈబీ నివేదిక. దీన్ని అరికట్టేందుకు ధరలు సవరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎస్ఈబీ. ఎస్ఈబీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో మద్యం సవరిస్తూ ఆదేశాలు జారీ.

* 180 ఎంల్ బాటిల్ ధర రూ.120కు మించని బ్రాండ్లకు రూ.30 నుంచి రూ.120 వరకూ తగ్గించిన ప్రభుత్వం

* క్వార్టర్ బాటిల్ ధర రూ.120 నుంచి రూ.150 వరకూ ధర ఉన్న బ్రాండ్లకు రూ.30 నుంచి రూ.280 వరకూ తగ్గింపు

* క్వార్టర్ బాటిల్  రూ.150 నుంచి రూ.190 మధ్య  ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయని ప్రభుత్వం

* క్వార్టర్ రూ.190 నుంచి రూ.210కి మించి ధర ఉన్న బ్రాండ్లకు రూ.40 నుంచి రూ.300 వరకూ పెంపు

* అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపయాల మేర ధర తగ్గించిన ప్రభుత్వం

* రెడీ టూ డ్రింక్ మద్యంపై రూ.30 మేర తగ్గింపు

Just In...