Published On: Mon, Sep 24th, 2018

ఏపీలో రెండ్రోజుల పాటు సంతాప దినాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతికి సంతాపంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో సంతాప దినాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటన జారీచేశారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయాలన్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి వినోద కార్యక్రమాలు ఈ రెండురోజుల్లో నిర్వహించరాదని ఆ ప్రకటనలో సీఎస్ దినేష్‌కుమార్ తెలిపారు.

Just In...