Published On: Fri, Apr 19th, 2019

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

సెల్ఐటి న్యూస్‌, విశాఖపట్నం: రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోను తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు అదనంగా పెరుగుతాయని తెలిపింది.

Just In...