Published On: Fri, Jul 5th, 2019

ఏపీలో 8న రైతు దినోత్సవం

* ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా స‌చివాల‌యంలో శుక్ర‌వారం అధికారుల‌తో ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి క‌న్న‌బాబు మాట్లాడుతూ కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటారని.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు రైతు దినోత్సవం నిర్వహిస్తారని చెప్పారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వేరుశనగ విత్తనాల కొరతను సరిదిద్దామని చెప్పారు. మొత్తం 3.13 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేసినట్టు తెలిపారు. ఉత్తరాంధ్రలో సరిపడా విత్తనాలను సరఫరా చేశామని మంత్రి వివరించారు.

Just In...