Published On: Thu, Mar 19th, 2020

ఏపీలో 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం..

* మ‌త్య‌కారుల జీవ‌న ప్ర‌మాణాలు పెంచాలి
* సమీక్ష స‌మావేశంలో సీఎం జ‌గ‌న్  
అమరావతి, సెల్ఐటి న్యూస్‌: మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సీఎం వైయస్ జగన్ గురువారం త‌మ విడిది కార్యాల‌యంలో సమీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై జ‌రిగిన సమీక్షలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు, మత్స్యకారుల జీవన ప్రమాణాల‌పై నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ వారికోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలి. వారి ప్రధాన వృత్తి వేట, దీనికోసం మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఫిషింగ్‌ హార్బర్లను పూర్తిచేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. కొత్తగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. రెండు విడతల్లో హార్బర్లు నిర్మాణం. దాదాపు రూ.2,901.61 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్‌ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. రెండో విడత కింద రూ.1597.61 కోట్లతో మరో ఐదు చోట్ల హార్బర్ల నిర్మాణం. ప్రకాశం జిల్లా వాడ్రేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలెం,  ఎడ్డువాని పాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ కోసం ఈ డబ్బు ఖర్చు. మొత్తంగా 9 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. డీప్‌ సీ ఫిషింగ్‌ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మిగిలి  ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలూ పూర్తిచేయాలని సీఎం ఆదేశం. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులు కన్నా.. .పర్యావరణ హితమైన ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

Just In...