Published On: Wed, Feb 6th, 2019

ఏపీ అసెంబ్లీలో 6 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధ‌వారం శాసనసభలో 6 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రైవేటు వర్సిటీల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ప్రపంచ స్థాయి డిజిటల్‌ విద్యాబోధనకు సంబంధించిన బిల్లులను మంత్రి గంటా శ్రీనివాసరావు, బీసీ ఉపప్రణాళిక బిల్లుతో పాటు మరో మూడు బిల్లులను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఈబీసీలో కాపులకు చదువు, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్‌కు ఉద్దేశించిన బిల్లుతో పాటు ఇతర అగ్రవర్ణాల పేదలకు సంబంధించి మరో బిల్లు, వ్యాట్‌ సవరణ బిల్లులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. మొత్తంపై నాలుగు బిల్లులను మంత్రి అచ్చెన్నాయుడు.. రెండింటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రవేశపెట్టారు. అనంతరం పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ నివేదికను భాజపా సభ్యుడు విష్ణుకుమార్‌రాజు సభలో ప్రవేశపెట్టారు.

Just In...