Published On: Mon, Nov 20th, 2017

ఏపీ అసెంబ్లీ పనిదినాలు పొడిగింపు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పనిదినాలను పొడిగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 25తోనే సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరిన్ని అంశాలపై చర్చించేందుకు వీలుగా సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25న శాసనసభకు సెలవు దినం కాగా.. ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Just In...