Published On: Wed, Oct 16th, 2019

ఏపీ ఆర్థిక‌మంత్రితో సింగ‌పూర్ ప్ర‌తినిధుల భేటీ

* సాంకేతిక , వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో సింగపూర్ దేశ సహకారంపై చ‌ర్చ‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సింగపూర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మద్య భాగస్వామ్యంలో భాగంగా మార్టిన్ యూన్ ఆధ్వ‌ర్యంలో సింగపూర్ దేశానికి చెందిన ఆరుగురు ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్‌రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి, ప్రధాన ఆర్థిక కార్యదర్శి, ప్రణాళిక శాఖ హోదా రీత్య కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు అధికారులతో బుధ‌వారం సమావేశం నిర్వహించారు. సాంకేతిక , వృత్తి విద్య మరియు నైపున్యాభివ్రుద్ధిలో సింగపూర్ దేశ సహకారంపై చర్చించారు.

Just In...