Published On: Sat, Apr 14th, 2018

ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవ‌త్స‌రం ఫలితాలు విడుదల

* 62శాతం ఉత్తీర్ణత

* 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా తొలి స్థానం

* మంత్రి గంటా వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇంటర్‌ మొదటి సంవ‌త్స‌రం ఫలితాలను విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఉద‌యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 62శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. 75శాతం ఉత్తీర్ణతతో కృష్ణా తొలి స్థానంలో నిలవగా.. 40శాతంతో కడప జిల్లా అట్టడుగున నిలిచింద‌ని తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,78,621 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,95,891 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. బాలురు 57శాతం, బాలికలు 67శాతం ఉత్తీర్ణులయ్యారు. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు ఉత్తీర్ణతలో అగ్రస్థానంలో నిలవగా.. కడప, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు అట్టడుగున నిలిచాయ‌న్నారు. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు.

Just In...