Published On: Sat, May 12th, 2018

ఏపీ ఐసెట్‌-2018 ఫలితాలు విడుదల

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ ఎడ్యుకేష‌న్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్‌-2108 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ సంద‌ర్భంగా విజయవాడ మ‌హాత్మాగాంధీరోడ్డులోని ఓ హోట‌ల్‌లో రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజ‌రై ఐసెట్‌-2018 ఫలితాల‌ను విడుదల చేశారు. అనంత‌రం మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వ‌ర్యంలో పరీక్షల నిర్వ‌హ‌ణ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఐసెట్‌లో 92.60శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి తెలిపారు. జూన్‌ 20 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐసెట్-2018 ప్రవేశ పరీక్షలకు 48,635 మంది పరీక్షకు హాజరుకాగా వారిలో 45,037 మంది (92.60 శాతం) అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 2017తో పోల్చితే ఉత్తీర్ణత శాతం 6.04 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారన్నారు. ప‌రీక్షలకు హాజరైన వారిలో పురుషులు 28,158 (57.89 %) స్త్రీలు 20,416 (41.98 %) , ట్రాన్స్ జెండర్స్ 61 మంది (0.12%) హాజరయ్యారన్నారు. వివిధ యూనివర్శిటీల పరిధిలో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థుల వివరాలను తెలియ‌జేశారు. ఎ.యూ పరిధిలో 93.49 శాతం, ఎస్వీయూ పరిధిలో 91.48 శాతం, ఓ.యూ పరిధిలో 95 శాతం, నాన్ లోకల్ క్యాటగిరిలో 95.31 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అన్ని సెట్ల ఫలితాలను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్‌లైన్‌లోనే నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారం సెట్స్ నిర్వహించడంతో పాటు, ఫలితాలను కూడా తక్కువ సమయంలో వెల్లడించామన్నారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు క్యాటగిరీల వారిగా బీసీ క్యాటగిరిలో 5,685 మంది (89.88 % , బిసీబిలో 7,127 మంది (91.62 %), బీసీ-సిలో 262 మంది, (91.61%) బిసీ-డిలో 6,723 మంది (90.73 %) బిసీ-ఈలో 2,375 మంది (90.79 %) ఎస్పీలు-5,774 మంది (100 %), ఎస్టీలు_640 మంది (100 %) ఉత్తీర్ణత సాధించగలిగారన్నారు. ఈ పరీక్షా ఫలితాల వివరాలు http://sche.ap.gov.in/ICET/ వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షా ఫలితాల పాస్వర్డ్ SVU@PiCET2018ను మంత్రి ప్రదర్శించారు. ర్యాంకు కార్డులను ఈ నెల 19వ తేది నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎంబీఏ కోర్సులు అందించే కళాశాలలు 384 కళాశాలల్లో 44,033 సీట్లు , ఎంసీఎ కోర్సును అందించే 139 కళాశాలల్లో 8,910 సీట్లు అందుబాటులో ఉ న్నాయన్నారు. కన్వీనర్ కోటాలో ఎంబిఎ సీట్లు 31,351, ఎంసీఎ సీట్లు 6,515 అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి ర్యాంకును సిహెచ్ ప్రసన్నకుమార్ (గుంటూరు), రెండవ ర్యాంకును భరత్ కుమార్ (అనంతపురం), మూడవ ర్యాంకు సాయికుమార్ రెడ్డి (అనంతపురం) సాధించారు. ఈ పరీక్షల నిర్వహణ ఎస్వీయూ ఉపకులపతి ఎం.దామోదరం చైర్మన్ గాను, ఆచార్య బి.సుధీర్ కన్వీనర్ గాను వ్యవహరించడం జరిగిందన్నారు.
 

Just In...