Published On: Tue, Mar 19th, 2019

ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

సెల్ఐటి న్యూస్‌, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల జాబితా సోమ‌వారం విడుదల చేసింది. 25 పార్లమెంట్‌ స్థానాలున్న ఏపీలో 22 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, నంద్యాల లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అభ్యర్థులు వీరే..
* అరకు(ఎస్టీ)- శృతిదేవి  
* శ్రీకాకుళం- దోల జగన్మోహనరావు
* విజయనగరం-ఎడ్ల ఆదిరాజు
* అనకాపల్లి- శ్రీరామ్‌ మూర్తి
* కాకినాడ- ఎం.ఎం. పల్లంరాజు
* అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్‌
* రాజమండ్రి- నల్లూరి విజయ శ్రీనివాసరావు
* నర్సాపురం- కనుమూరి బాపిరాజు
* ఏలూరు-  జెట్టి గురునాథరావు
* మచిలీపట్నం- గొల్లు కృష్ణ
* గుంటూరు- షేక్‌ మస్తాన్‌ వలీ
* నర్సారావుపేట- పక్కల సూరిబాబు
* బాపట్ల(ఎస్సీ) జేడీ శీలం
* ఒంగోలు- ఎస్‌డీజేమ్‌ ప్రసాద్‌
* కర్నూలు-  అహ్మద్‌ అలీ ఖాన్‌
* అనంతపురం- కుంచం రాజీవ్‌రెడ్డి
* హిందూపురం- కేటీ శ్రీధర్‌
* కడప- గుండ్లకుంట శ్రీరాములు
* నెల్లూరు- చెరువు దేవకుమార్‌రెడ్డి
* తిరుపతి(ఎస్సీ)- చింతా మోహన్‌
* రాజంపేట- మహ్మద్‌ షాజహాన్‌ బాషా
* చిత్తూరు(ఎస్సీ)- చీమల రంగప్ప

Just In...