Published On: Thu, Mar 26th, 2020

ఏపీ కేబినెట్‌ సమావేశం నేడు..

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఏపీ కేబినెట్‌ సమావేశం శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో జరగనుంది. మంత్రులు అంద‌రూ సామాజిక దూరం పాటించేలా ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కేబినెట్ స‌మావేశంలో ముఖ్యంగా మూడు నెలల బడ్జెట్‌కు ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురానుంది. అలాగే జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ పెట్టనుంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం పంపనుంది.

Just In...