Published On: Sat, Jun 27th, 2020

ఏపీ కొత్త పథకం.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌…

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: గిరిజన మహిళలు, శిశువులకు అదనపు పౌష్టికాహారం అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పేరుతో 77 గిరిజన మండలాల్లో ఈ పథకం అమలుకు విధివిధానాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మిగతా చోట్ల గర్భిణులు, బాలింతలు, శిశువులకు సంపూర్ణ పోషక పథకం వర్తిస్తుంది. 257 ఐసీడీఎస్‌ పథకాల ద్వారా అన్ని జిల్లాల్లో సంపూర్ణ పోషణ పథకం అమలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలుకు కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారానికి ఒక్కో లబ్ధిదారుకు నెలకు రూ.600, గర్భిణులకు, బాలింతలకు ఇంటికి తీసుకెళ్లే రేషన్‌ కోసం నెలకు రూ.500, శిశువుల పౌష్టికాహారం కోసం నెలకు రూ.533 ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Just In...