Published On: Fri, Jul 19th, 2019

ఏపీ టూరిజం అభివృద్ధిప‌థంలో ముందుకెళుతుంది

* అధికారుల‌తో స‌మీక్ష‌లో మంత్రి అవంతి శ్రీనివాస్‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు అధికారుల‌తో రెండు రోజుల‌పాటు జరిపిన రివ్యూ మీటింగ్‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌ర్యాట‌కానికి సంబంధించిన ప్రాజెక్టులు త్వరితగతిన పట్టా లెక్కించటానికి అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక  కేంద్రాలు వాటి ప్రస్తుత  పరిస్థితి మరియు కొత్త ప్రాజెక్ట్ లు గురించి చర్చించారు.

 

 

 

 

 ప్రారంభానికి సిద్ధంగా గా ఉన్న ప్రాజెక్ట్స్ వివరాలు…
1) యెర్ర మట్టి దిబ్బల వద్ద ( నేరెళ్ల వలస, విశాఖపట్నం ) కంటైనర్ రిసార్ట్
2) అనంత గిరి హరిత రిసార్ట్స్ వద్ద డ్రైవ్ ఇన్ రెస్టారెంట్
3) సామర్లకోట వద్ద వుడెన్ కాటేజెస్ మరియు డార్మిటరి
4) కడప జిల్లా అడపూర్, వద్ద స్నాక్ మరియు ఇంటర్ ప్రిటేషన్ కేంద్రం
5) కర్నూల్ జిల్లా ఎల్లార్తి దర్గా డార్మిటరీ మరియు రెస్టారెంట్
6) అనంతపూర్ వద్ద డార్మిటరీ మరియు రెస్టారెంట్
7) అనంతపూర్ జిల్లా మడకశిర వద్ద రెస్టారెంట్

ఫౌండేషన్ స్టోన్స్ …
పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం వద్ద మరియు తాడేపల్లి గూడెం కుంచపల్లె వద్ద ఫౌండేషన్ స్టోన్స్ వేయుటకు సిద్ధం గా వున్నవి

కొత్త ప్రాజెక్ట్స్…
క్రింద పేర్కొన్న బడిన ప్రాజెక్ట్ లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సహాయ నిధులతో మరియు ప్రభత్వ మరియు ప్రైవేట్ కార్యక్రమమం (పీపీపీ) తో అయినా చేయటానికి  ఎంచుకొనబడి డీపీఆర్  సిద్ధం చేయటానికి ఆదేశాలిచ్చారు
1) విజయనగరం జిల్లా రామతీర్ధం వద్ద టూరిజం ఆమెనీటిఎస్
2) విజయనగరం జిల్లా తాటిపూడి  రిజర్వాయర్  వద్ద రిసార్ట్స్
3) విశాఖపట్నం మధురవాడ మరియు రుషికొండ వద్ద ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్ట్స్, రిసార్ట్స్
4) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టూరిజం ఆఫీస్ వద్ద బడ్జెట్ హోటల్
5) తూర్పుగోదావరి జిల్లా ఏలూరు వద్ద హైవే పక్కనే వున్న టూరిజం స్థలంలో కన్వెన్షన్ హాల్
6) గుంటూరు జిల్లా మాచెర్ల నాగులవరం వద్ద  ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్ట్
7) నెల్లూరు జిల్లా వేదగిరి వద్ద టూరిజం ప్రాజెక్ట్ మరియు కండలేరు రిజర్వాయర్ వద్ద జల క్రీడలు మరియు రిసార్ట్స్
8) చిత్తూర్ జిల్లా కాణిపాకం వద్ద హోటల్
9) చిత్తూర్ జిల్లా కైలాసనాధ కొండ వద్ద ఎకో టూరిజం పార్క్
10)కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద ఎకో టూరిజం పార్క్ మరియు గండికోట వద్ద ఇంటిగ్రేటెడ్ టూరిజం పార్క్
11)కర్నూల్ జిల్లా వాల్మీకి గుహలు వద్ద అడ్వెంచర్ పార్క్ మరియు దేవరగట్ట శివాలయం వద్ద టూరిజం ఆమెనీటిఎస్

Just In...