Published On: Fri, Feb 15th, 2019

ఏపీ డీఎస్సీ-2018 మెరిట్ లిస్ట్‌ విడుదల

సెల్ఐటి న్యూస్‌, ఎడ్య‌కేష‌న్‌: ఏపీ డీఎస్సీ-2018 మెరిట్ లిస్ట్‌ విడుదలైంది. శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు జాబితాను విడుదల చేశారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారమే మెరిట్‌ జాబితా విడుదల చేశామన్నారు. 7,092 పోస్టులకు గాను 6,08,155 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. మొత్తం 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారయ్యారని మంత్రి చెప్పారు. మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ పోస్టులు తొలిసారి భర్తీ చేశామన్నారు. పరీక్షలోని 135 అభ్యంతరాలను స్వీకరించామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మే 15న నియామక పత్రాలు అందజేస్తామని, ఎంపికైన వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Just In...