Published On: Sat, Jul 20th, 2019

ఏపీ నూతన గవర్నర్‌ను కలిసిన విజయసాయి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషన్ హరిచందన్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కలిశారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో శ‌నివారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, ఏపీ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బిశ్వభూషన్‌ను శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.

Just In...