Published On: Tue, May 14th, 2019

ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పించారు.  12 ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌ జరగనుంది.

Just In...