Published On: Fri, Jul 19th, 2019

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు..

* ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి మరో భారీ నిర్ణయం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మ‌త్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం జ‌రిగిన మంత్రివ‌ర్గం స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

• ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాలని కేబినెట్ నిర్ణయం. ఇందుకోసం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
• ఈ చట్టం ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటామని పాదయాత్రలో ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి
• ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం – విప్లవాత్మక చట్టానికి ప్రభుత్వం శ్రీకారం
• ఈ సమావేశాల్లోనే చట్టం, ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ అంగీకారం
• అన్ని నామినేటెడ్‌ పదవుల్లో ఈ వర్గాలకు ప్రాతినిథ్యం

బీసీలకు మరో బొనాంజా :
• రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాది రూ.10వేలు ఇవ్వడానికి కేబినెట్‌ అంగీకారం
• పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా ఛైర్మన్‌ :
• టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా ఛైర్మన్‌ – చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు బొనాంజా :
• ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మహిళల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి కీలక నిర్ణయాలు
• ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు, ట్రస్టులు, మార్కెట్‌యార్డుల్లో  50శాతం పదవులు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే
• నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం మహిళలకే కేటాయింపు
• దేవాలయాల కమిటీల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే
• ప్రభుత్వ నామినేషన్‌ కాంట్రాక్టులు, సర్వీసుల్లో 50శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే
• ఇందులోనూ యాభైశాతం కాంట్రాక్టులు, సర్వీసులు మహిళలకు కేటాయింపు
దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైఎస్ జగన్‌ ప్రభుత్వం  శ్రీకారం :
• జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఓకే.
• అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగుగా పేర్కొన్న మంత్రివర్గం
• టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతికి అడ్డుకట్టకు ఈ సమావేశంలోనే చట్టం
• మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట
• హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన
• అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలు
• హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి  పరిధిలోకి రూ.100 కోట్లకు పైబడ్డ అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
• పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే.
• టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్‌ వెంచర్లు, స్పెషల్‌ పర్సస్‌ వెహికల్స్‌ సహా అన్ని ప్రాజెక్టులపైన జడ్జి పరిశీలన
• పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్ల దాటితే.. జడ్జి పరిధిలోకి రావాల్సిందే
• జడ్జికి సహాయంగా నిపుణులను అందించనున్న ప్రభుత్వం, అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరే అవకాశం
• వారం రోజుల పాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు ప్రజా బాహుళ్యంలోకి పనుల ప్రతిపాదనలు
• తర్వాత 8 రోజుల పాటు జడ్జి పరిశీలన
• సూచనలు, సలహాలు అందిస్తున్నవారికి తగిన రక్షణ
• జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించాల్సిందిగా ఆదేశాలు
• మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు, ఆ తర్వాతే బిడ్డింగ్‌
• ఎవ్వరికీ లబ్ధి చేకూర్చకుండా, అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు
• పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ఈ విధానమన్న మంత్రివర్గం
• ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా జడ్జికి అవకాశం
• జడ్జి, జడ్జి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్‌ సర్వెంట్లుగా భావిస్తారు. దీనివల్ల వారికి రక్షణ ఉంటుంది.

‘‘వైయస్సార్‌ నవోదయం’’ కింద కొత్త పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం:

• సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
• ‘‘వైయస్సార్‌ నవోదయం’’ కింద కొత్త పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
• మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా స్కీం
• జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాల గుర్తింపు
• రూ.4వేల కోట్ల రుణాలు వన్‌టైం రీస్ట్రక్చర్‌
• ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం
• ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం
• వినియోగించుకునేందుకు 9 నెలల వ్యవధి
• త్వరలో ప్రారంభించనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యాక్ట్‌ –2019 ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం:

• నాటి ఏపీఈడీబీ చట్టం తొలగింపు, దాని స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యాక్ట్‌ –2019 ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
• పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యాలు
• బోర్డు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి, మొత్తం 7గురు డైరెక్టర్లు
• డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ తదితరులు
• ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహామండలి
• ఇందులో ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు
• ప్రధాన కార్యాలయం విజయవాడలో, మరో కార్యాలయం హైదరాబాద్‌లో యువపారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, వారికి శిక్షణ
• గతంలో ఏపీఈడీబీలో అవసరానికి మించి భారీ సంఖ్యలో పదవులు, పక్షపాతం, అవినీతి, విదేశీ పర్యటనల పేరిట దుబారా

200 యూనిట్ల వరకూ ఎస్సీలకు ఉచితంగా కరెంటు :

• రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం
• ఈ నిర్ణయంతో 15,62,684 మంది ఎస్సీలకు లబ్ధి
• మొత్తంగా రూ.411 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణలపై ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం :
• చట్టం ద్వారా పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్‌ల ఏర్పాటు
• విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణపై దృష్టి
• విద్యాహక్కు చట్టం అమలుపైనా దృష్టి

నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా గొప్ప అడుగు :

• పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే
• పీపీపీ ప్రాజెక్టులు కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్‌ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75శాతం ఉద్యోగాలు వీరికే.
• పరిశ్రమలకోసం భూములు కోల్పోయినవారికి, ఇతర నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాల కోసం చట్టం.
• నిర్వాసితుల జీవనోపాధికి గ్యారంటీ కల్పించడం కూడా చట్టంలో ఒక భాగం
• ఈ విప్లవాత్మక చట్టానికి కేబినెట్‌ అంగీకారం
• ముసాయిదా బిల్లుకు ఓకే చెప్పిన రాష్ట్ర మంత్రివర్గం

Just In...