Published On: Sat, Sep 19th, 2020

ఏపీ మంత్రి కుమారుడికి బెంజికారు లంచం

* తెదేపా నేత, మాజీమంత్రి కిడారీ శ్రావణ్‌కుమార్

విశాఖపట్నం, సెల్ఐటి న్యూస్‌: ఏపీ కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజికారు బహుమతిగా ఇచ్చారని తెదేపా మాజీ మంత్రి కిడారీ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న తన క్యాంపు కార్యాలయంలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ… మంత్రి జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని పేర్కొన్నారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ‘మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదు.. లంచం’ అని ఆరోపించారు. ఓ ముద్దాయికీ మంత్రి జయరాం కుమారుడికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఈశ్వర్‌కు బెంజికారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరముందన్నారు. జయరాంను మంత్రి మండలి నుంచి తప్పించాలని ఈ సందర్భంగా కిడారీ డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో జయరాంను మంత్రిగా కొనసాగించడం న్యాయం కాదన్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా తెదేపా నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Just In...