Published On: Wed, Sep 4th, 2019

ఏపీ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు ఇవే ..

సెల్ఐటి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జంగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. చర్చించిన అంశాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాటి వివరాలు ఇవి.

పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌లోకి ఆర్టీసీ విలీనానికి ఆమోదం:

* ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికను ఆమోదించిన మంత్రివర్గం
* ఆర్టీసీ ఉద్యోగస్తులందర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిగణిస్తారు
* రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు అవుతుంది
* ఇందులో వీరందర్నీ రీ రిజిగ్నేట్‌ చేయాలన్న ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సును ఆమోదించిన మంత్రివర్గం
* ఈ ప్రక్రియను మూడు మాసాల్లో పూర్తిచేయాలని రవాణాశాఖ, ఆర్థికశాఖ, న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖలకు సీఎం ఆదేశం
* ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలూ, నియమ నిబంధనలు పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి
* ప్రభుత్వ ఉద్యోగుల్లానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకి పెంచుతారు
* బస్సు ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్సు ఛార్జీల నియంత్రణ కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
* ఈ విలీనం ద్వారా 3300 కోట్ల ఆర్థిక బాధ్యతను చేపట్టనున్న ప్రభుత్వం

ఇసుక మాఫియాను అరికట్టే కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం:

* ఇసుక తవ్వకం, రవాణాలను చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
* పర్యావరణం దెబ్బతినకుండా గతంలో ఉన్న ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్‌ పాలసీ
* సరసమైన ధరకు ఇసుక లభించేలా పాలసీలో విధివిధానాలు
* గతంలో అక్రమ పద్ధతుల్లో ఇసుకకు భారీగా ముట్టాచెప్పాల్సిన పరిస్థితి
* అప్పటి రేట్లతో పోలిస్తే.. భారీగా తగ్గనున్న ఇసుక ధర
* చట్ట పద్ధతిలో నేరుగా వినయోగదారుకు మాఫియాతో సంబంధం లేకుండా చేరనున్న ఇసుక
* ఇవ్వాళ్టికి 13 జిల్లాల్లో 41 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు
* వీటిని 70 నుంచి 80 వరకూ అక్టోబరు నాటికి పెంచనున్న ప్రభుత్వం
* క్రమేణా ఇంకా పెంచనున్న ప్రభుత్వం రీ చ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయం, అక్కడ నుంచి రవాణా

ఖర్చు అదనం

* టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90లు రవాణా ఖర్చు
* 10 కిలోమీటర్ల లోపు వరకూ ట్రాక్టర్ల ద్వారా రవాణా, రవాణా ఖర్చు రూ.500
* పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యత ఏపీఎండీసీదే
* క్యూబిక్‌ మీటరుకు రూ.60లు రైతులకు చెల్లించనున్న ఏపీఎండీసీ
* లోండిగ్‌ రూపంలో, తవ్వకాల రూపంలో రైతులకు ఎలాంటి భారం ఉండదు, అవన్నీ ఏపీఎండీసే భరిస్తోంది
* ఇప్పటివరకూ 100 రీచ్‌లు సిద్ధంచేసిన ఏపీఎండీసీ
* 31 చోట్ల డీ సిల్టేషన్‌ చేయనున్న ఏపీఎండీసీ
* 82 చోట్ల పట్టా భూములను గుర్తించిన ఏపీఎండీసీ
* ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనంలో జీపీఎస్‌ ఏర్పాటు
* రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు, స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారుకు వెళ్లేంత వరకూ వాహనాల్లో జీపీఎస్‌
* అనుమతి లేని వాహనాలు ఇసుక రవాణా చేయకూడదు
* ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేధం

ఆటోవాలా, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేలు పంపిణీ:

* సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునేవారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం
* ఓనర్‌ కం డ్రైవర్‌లకు ఆర్థిక సహాయం
* భర్త, భార్యలు ఇద్దరూ కూడా ఒక యూనిట్‌గా చూస్తారు
* అదే కుటుంబంలో మేజర్‌ కొడుకు లేదా కూతురు ఓనర్‌ కం డ్రైవర్‌ అయితే వారిని వేరే యూనిట్‌గా చూస్తారు
* ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, రిపేర్లకు ఈ ఆర్థిక సహాయం
* నేరుగా లబ్దిదారులకు అందించనున్న ప్రభుత్వం
* 2019 మార్చి నెలాఖరు వరకూ 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్టు అంచనా
* ఇందులో సొంతంగా నడుపుకుంటున్నవి 3.97 లక్షలు ఉన్నట్టు అంచనా
* ఏడాదికి రూ. 397. 93 కోట్లు వారికి సహాయం చేయనున్న ప్రభుత్వం
* ఇంకా పెరిగినా భరించడానికి ప్రభుత్వం సిద్ధం
* ఆన్‌లైన్లో సెప్టెంబరు 10 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి
* సెప్టెంబరు 4వ వారం నుంచి అందించనున్న ప్రభుత్వం

* బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత ఆ రశీదులను లబ్దిదారులకు అందించనున్న గ్రామ, వార్డు వాలంటీర్లు

వైయస్సార్‌ పెళ్లికానుక:

* పెళ్లిరోజే వైయస్సార్‌ పెళ్లి కానుకను అందించనున్న ప్రభుత్వం
* శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి
* దాదాపు 96,397 మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా
* మొత్తంగా రూ.746.55 కోట్లు ఏడాదికి ఖర్చు చేయనున్న ప్రభుత్వం
* ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు
* ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ. 1లక్ష పెంపు
* బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50వేలు పెంపు
* మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ.1 లక్ష పెంపు
* వికలాంగులకు రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు పెంపు
* భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.2వేల నుంచి రూ.1లక్షకు పెంపు
* ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ.1.20 లక్షలు
* ఎస్టీ కులాంతర వివాహాలు చేసుకుంటే… .రూ. 1.20లక్షలు
* బీసీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ. 70వేలు
* ఆశావర్కర్ల జీతాల పెంపునకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం
* రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం
* 2018 ఆగస్టు నుంచి రూ. 1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3వేలకు పెంపు
* మరో రూ.3వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం
* ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, దీనికి మంత్రివర్గం ఆమోదం
* జీతాల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను విడుదలచేసిన ప్రభుత్వం, ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం
* జనవరి నుంచి జులై వరకూ గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది
* ఆ బకాయిలకోసం రూ.132 కోట్లను ఇదివరకే విడుదల చేసిన ప్రభుత్వం
ప్రత్యేక హోదా పోరాటంలో 2014-19 వరకు నమోదైన కేసు ఎత్తివేతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ :
* ప్రత్యేక హోదాకోసం పోరాటంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ మంత్రివర్గ నిర్ణయం
* ప్రాసిక్యూషన్‌ విత్‌డ్రా చేయించడానికి కేబినెట్‌ ఆమోదం

వైయస్సార్‌ క్రీడా ప్రోత్సాహకాలు :

* జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు
* 2014 నుంచి 2019 వరకూ పతకాలు సాధించిన వారికి చెల్లింపు
* గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యానికి గురైన వీరందరినీ గుర్తించి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం
* రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయింపునకు నిర్ణయం
* ఇప్పటివరకూ 162 మంది దరఖాస్తు చేశారు
* బంగారు పతకానికి రూ. 5లక్ష, వెండి పతకానికి రూ.4లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు
* జూనియర్, సబ్‌ జూనియర్‌స్థాయిలో పతకాలు సాధించని వారికీ నగదు ప్రోత్సహకాలు
* వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాపింయన్‌షిప్‌ సాధించిన సింధుకు కేబినెట్‌ అభినందనలు
ఆంధ్య్రాబాంకు విలీనంపై చర్చించిన రాష్ట్ర కేబినెట్‌ :
* భోగరాజు పట్టాభిసీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్‌ డిమాండ్‌
* ప్రధానికి సీఎం లేఖరాయాలని నిర్ణయించిన కేబినెట్‌..

రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం డీఆర్ డీవోకు 5 ఎకరాల భూమి కేటాయింపు ..

* కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూ కేటాయింపు చేస్తూ మంత్రివర్గ నిర్ణయం
* రాకెట్‌ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న డీఆర్డీఓ
నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం :
* రూ. 3216.11 కోట్ల టెండర్‌ను రద్దుకు కేబినెట్‌ ఆమోదం
* రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం
* కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం
• నియమాలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25శాతం మేర అయిన
• ఇచ్చిన రూ.780 కోట్ల మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లను రికవరీకి నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించిన మంత్రివర్గం.

ఇతర అంశాలు :

• చిత్తూరు, కడప జిల్లాల్లో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్‌ లెవల్‌ పంపింగ్‌ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం
• నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్‌ కోసం 20.19 ఎకరాలు దక్షిణమధ్య రైల్వేకు కేటాయింపు
• బలిమెల ఘటనలో అమరడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో 10 సెంట్ల భూమి కేటాయింపు.
• మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రివర్గం
• భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ
• టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
• మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు, మంత్రివర్గం ఆమోదం. 2005 నుంచి మావోయిస్టులపై కొనసాగుతున్న నిషేధం.

Just In...