Published On: Tue, Jun 18th, 2019

ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగాయి. చివరిరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి సమావేశాలు ఇవే. ఐదు రోజులపాటు కొనసాగిన సమావేశాల్లో 19 గంటల 25 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. తొలిరోజు సభ్యుల ప్రమాణస్వీకారాలు, రెండో రోజు స్పీకర్‌ ఎన్నిక చేపట్టారు. మూడో రోజు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగు, ఐదో రోజు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ చేపట్టిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. దీంతో పాటు సీఎం జగన్‌.. ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

Just In...