Published On: Thu, Jul 9th, 2020

ఏపీ సీఎంవోలో మార్పులు చేర్పులు…

* సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయింపులు

అమ‌రావ‌తి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: ఏపీ సీఎంవోలో మార్పులు చేర్పులు జ‌రిగాయి. సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయింపులు చేశారు. సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్‌కల్లాం, పీవీ రమేష్, జే.మురళిని త‌ప్పిస్తూ సీఎం జగన్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్‌ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు చేశారు. ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో.. జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్. సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో.. ర‌వాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ. ధనుంజయ్ రెడ్డి పరిధిలో.. జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ ఉంటాయి.

Just In...