Published On: Mon, Mar 11th, 2019

ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు

* కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్‌ 11నే ఎన్నికలు జరగనున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, ఈసారి తెలంగాణ తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయ ఢంకా మోగించిన విష‌యం విధిత‌మె.

Just In...