Published On: Wed, Mar 13th, 2019

ఏప్రిల్‌ 3 నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాలు

* టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం

* గోడపత్రికల ఆవిష్కరణ 

సెల్ఐటి న్యూస్‌, తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో మంగళవారం జెఈవో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ    ఉదయం    సాయంత్రం
03-04-19(బుధవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
04-04-19(గురువారం) చిన్నశేష వాహనం హంస వాహనం
05-04-19(శుక్రవారం)  సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
06-04-19(శనివారం)  కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
07-04-19(ఆదివారం)  పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
08-04-19(సోమవారం)  హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
09-04-19(మంగళవారం)  సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
10-04-19(బుధవారం)  రథోత్సవం అశ్వవాహనం
11-04-19(గురువారం)  పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం
ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు..
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి, 15న శ్రీ సీతారామ కల్యాణం, 16న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు  తెప్పోత్సవాలు.. 
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రామచంద్ర పుష్కరిణిలో 17వ తేదీన మొదటిరోజు 5 చుట్లు, 18న రెండవ రోజు ఏడు చుట్లు, 19న చివరిరోజు తొమ్మిది చుట్లు తిరిగి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఈ.సీ.శ్రీధర్, ఏఈవో తిరుమలయ్య, సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, జి.రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...