Published On: Sat, Jan 4th, 2020

ఏసీబీ డీజీగా పి.సీతారామాంజ‌నేయులు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏసీబీ డీజీగా పి.సీతారామాంజ‌నేయులు నియ‌మితుల‌య్యారు. అవినీతి నిరోధక శాఖ డీజీ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర‌కు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా శ‌నివారం ఆదేశాలు జారీ చేసింది. కుమార్ విశ్వ‌జిత్ స్థానంలో రవాణా శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ పి.సీతారామాంజనేయులుకు అదనపు బాద్యతలు అప్పగించింది. రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Just In...