Published On: Thu, Jan 23rd, 2020

ఏసీబీ వలలో పంచాయతీ కార్య‌ద‌ర్శి…

విశాఖ‌ప‌ట్నం, సెల్ఐటి న్యూస్ క్రైం: టోల్‌ఫ్రీ నంబ‌రుకు వచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ‌ప‌ట్నం జిల్లా చోడ‌వ‌రం మండ‌లం ల‌క్క‌వ‌రం పంచాయ‌తీ పంచాయతీ సెక్రటరీ ఎన్.నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబడ్డారు. ఫిర్యాదు దారుడు అయిన పి.సింహాద్రి నాయుడుకి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని న‌మ్మ‌బ‌లికి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఉండ‌గా ప‌క్కా స‌మాచారం మేర‌కు దాడులు చేసి ఏసీబీ విశాఖపట్నం అధికారులకు పట్టుబడ్డారు.

Just In...