Published On: Tue, Jun 25th, 2019

ఏసీబీ వలలో విశాఖ సహకార శాఖ ఉద్యోగి

సెల్ఐటి న్యూస్‌, విశాఖప‌ట్నం: విశాఖ సహకార శాఖ డివిజినల్‌ రిజిస్ట్రార్‌ మోషా ఏసీబీ వలకు చిక్కాడు. విశాఖ వ్యాలీ విద్యా సంస్థ సమీపంలోని వెటర్నరీ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘం స్థలాలపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. దీనిపై విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం మోషాను నియమించింది. తాను సానుకూలంగా నివేదిక ఇస్తేనే స్థలాలు, సైట్లు వస్తాయని సొసైటీ సభ్యులకు స్పష్టం చేసిన మోసా.. అందుకు తనకు కనీసం రూ.2కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఏప్రిల్‌ నుంచి బేరసారాలు నడుస్తుండగా.. చివరికి రూ.కోటి విలువైన భూమిని మోషా సోదరుడు మల్లికార్జునరావు పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సంఘం ప్రతినిధులు సిద్ధపడ్డారు. విశాఖ టర్నర్‌ చౌల్ట్రీ వద్ద ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ పూర్తయింది. ఈ ప్రక్రియనంతటినీ రికార్డు చేసిన ఏసీబీ అధికారులు మోషాను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు.

Just In...