Published On: Tue, Sep 12th, 2017

ఐటి అధికారులతో తితిదే జెఈవో సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: భక్తులకు మరింత వేగంగా, మెరుగ్గా, పారదర్శకంగా సేలందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు టిటిడి ఐటి, టిసిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం సమావేశం నిర్వ‌హించారు. కాటేజీ అలాట్‌మెంట్‌ సిస్టమ్‌ అప్లికేషన్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. గదుల అడ్వాన్స్‌ బుకింగ్‌కు సంబంధించి గత పది రోజులతో పాటు రానున్న 45 రోజుల సమాచారాన్ని సమీక్షించిన అనంతరం భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నందకం విశ్రాంతి గృహంలో గదుల ఎఆర్‌పి సీలింగ్‌ను 150కి పరిమితం చేయాలని సూచించారు. కల్యాణకట్టలో పారదర్శకత పెంచేందుకు రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌పై చర్చించారు. ఈ సమావేశంలో ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి సుధాకర్‌, డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్‌, వెంకటయ్య, ఓఎస్‌డి లక్ష్మీనారాయణ యాదవ్‌, ఇడిపి మేనేజర్‌ భాస్కర్‌, ఓఎస్‌డి బాలాజిప్రసాద్‌, టిసిఎస్‌ అధికారులు భీమశేఖర్‌, సత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

tirumala_2

Just In...