Published On: Sun, Jul 12th, 2020

ఐపీఎస్ అధికారుల‌కు అధునాత‌న ఆయుధాలు

* స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును ప‌రిశీలించిన డీజీపీ గౌతం స‌వాంగ్‌
మంగ‌ళ‌గిరి, సెల్ఐటి న్యూస్‌: మంగళగిరి 6వ బెటాలియన్ నులకపేటలోని  ఫైరింగ్ రేంజ్‌ని ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ శ‌నివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ ఫైరింగ్ రేంజ్ మైదానంలో ఇజ్రాయిల్‌కు చెందిన అత్యంత అధునాతనమైన ఆయుధాలను స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును డీజీపీ పరిశీలించారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు అత్యంత అధునాతనమైన గ్లాక్ పిస్టల్స్‌ను అందజేశారు. అనంత‌రం స్వయంగా ఐపీఎస్ అధికారులు గ్లాక్ పిస్టల్‌తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నర్, పిఅండ్ ఎల్ ఐజీ నాగేంద్రకుమార్, డి.ఐ.జీలు రాజశేఖర్ బాబు, విజయ్‌కుమార్, పలువురు ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.

Just In...