Published On: Tue, Apr 17th, 2018

ఒక్క‌రోజు బంద్‌తో రాష్ట్రానికి ఎంత న‌ష్టమో ఆలోచించాలి

* మనల్ని మనం శిక్షించుకోరాదు

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. సోమ‌వారం ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసం నుంచి జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారులు, స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ ఒక్క‌రోజు బంద్ వ‌ల్ల ఎంత న‌ష్టం వాటిల్లుతుందో ఆలోచించుకోవాల‌ని సూచించారు. మనల్ని మన‌మే శిక్షించుకోరాద‌ని పేర్కొన్నారు. మనకు అన్యాయం చేసినవారిని శిక్షించాలి. మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాల‌ని తెలిపారు. అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొనండి, అధికంగా మరో గంటసేపు పనిచేయండని కోరాన‌ని వివ‌రించారు. మన సమర్ధతతో జాతీయంగా అన్ని అంశాలలో ముందున్నాం అన్నారు. తలసరి ఆదాయం, జీవిఏ జిల్లాలవారీగా విశ్లేషించుకోవాల‌ని, ఎప్పటికప్పుడు లక్ష్యాలను చేరుకోవాల‌ని సూచించారు.

Just In...