Published On: Mon, Oct 19th, 2020

కనకదుర్గ ఫ్లైఓవర్ వ‌ద్ద అప‌శృతి…!

* కాంక్రీట్ పెచ్చులు ఊడిప‌డి కానిస్టేబుల్‌కు గాయాలు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఫ్లైఓవర్ వ‌ద్ద అప‌శృతి చోటుచేసుకుంది. అశోక్ పిల్లర్ సమీపంలోని ఫ్లై ఓవర్ పైభాగంలో కాంక్రీట్ పెచ్చులు ఊడి పడ‌డంతో సోమ‌వారం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కి గాయాలు అయ్యాయి. ఏపిఎస్‌పి బెటాలియన్‌కి చెందిన రాంబాబు దసరా ఉత్సవాల బందోబస్తు కోసం విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఉన్న‌ట్టుండి రాంబాబు మీద పెచ్చులు పడటంతో అతని చేతికి, భుజానికి గాయాల‌య్యాయి. ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లై ఓవర్ పటిష్టత‌పై న‌గ‌ర‌వాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Just In...