Published On: Wed, Aug 12th, 2020

కనివినీ ఎరుగ‌ని రీతిలో పోలీస్ శాఖ విశిష్ట సేవ‌లు

* ఏబీసీడీ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో డీజీపీ గౌతం స‌వాంగ్‌

అమ‌రావ‌తి క్రైం, సెల్ఐటి న్యూస్‌: దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజలకు విశేషమైన, విశిష్టమైన అందిస్తుందని ఏపి డీజీపీ గౌతం స‌వాంగ్ అన్నారు. మంగ‌ళ‌గిరిలోని డీజీపీ కార్యాల‌యంలో బుధ‌వారం ఏబిసిడి అవార్డ్స్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డీజీపీ గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో 2019 సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసిక మరియు మొదటి త్రైమాసిక 2020 సంవత్సరం యొక్క అవార్డు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఏబిసిడి అవార్డ్స్ అనేది దర్యాప్తులో పోలీసు వారు చేసిన అత్యుత్తమ దర్యాప్తు కి మొదటి, రెండవ, మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది మొదటి బహుమతిగా లక్ష రూపాయలు మరియు ప్రసంసా పత్రం, రెండో బహుమతిగా రూ.60 వేలు మరియు ప్రసంసా పత్రం, మూడో బహుమతిగా రూ.40 వేలు, ప్రసంసా పత్రం అంద‌జేశారు. కేసుల దర్యాప్తులో అధికారులు అత్యుత్తమ దర్యాప్తు ప్రమాణాలను నేర్చుకొనే లక్ష్యంతో ఈ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం నాలుగు భాగాలుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2019లో మొదటి మరియు రెండవ త్రైమాసిక కార్యక్రమాలు ముగించుకుని ఉన్నాము. మూడు నాలుగు భాగాల 2019 కొరకు మరియు అదే విధంగా మొదటి భాగాల 2020 సంవత్సరం సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. కార్యక్రమంలో మొత్తం 103 అధికారులు మరియు సిబ్బందికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది. పౌర హక్కుల పరిరక్షణ అంశంలో భాగంగా షెడ్యూల్డ్ కులాలు తెగలకు అత్యాచార నేర నిరోధక
చట్టం 1989 ప్రకారం నేర పరిశోధన చేసి నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసిన అధికారులు అవార్డు కూడా ప్రకటించారు. ఉత్తమ పీసీఆర్ అవార్డుకు ఎంపికైన డీఎస్పీ కె.సుప్ర‌జను అభినందించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజలకు విశేషమైన, విశిష్టమైన అందిస్తుంద‌న్నారు. ఇందుకుగాను దేశ ప్రధాని ప్రశంసలను అందుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో ఎన్నడూ లేని విధంగా, ఈ సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో 26 సాంకేతిక అవార్డులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీసుకుందన్నారు. కార్యక్రమంలో రైల్వే డీజీ ద్వారకా తిరుమలరావు, ఏడీజీపీ సీఐడీ పి.వి.సునీల్‌కుమార్, ఏడీజీపీ లాఅండ్ఆర్డ‌ర్ రవిశంకర్ అయ్యన్నార్, ఏడీజీపీ రోడ్ సేఫ్టీ ఉజాలా త్రిపాఠి, మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 

Just In...